
సంగారెడ్డి టౌన్ , వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ముందు రేషన్‌కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చారని టీజీఐఐసీ చైర్పర్సన్నిర్మలజగ్గారెడ్డి అన్నారు. బుధవారం ఆమె పట్టణంలోని 28వ వార్డు రేషన్‌షాపులో కలెక్టర్ క్రాంతితో కలిసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.
సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పేదలకు దొడ్డుబియ్యం ఇవ్వడం వల్ల ఎవరూ తినక వాటిని విక్రయించి సన్నబియ్యం కొనుగోలు చేసేవారన్నారు. సన్నబియ్యం పంపిణీతో ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదన్నారు. కలెక్టర్క్రాంతి మాట్లాడుతూ.. జిల్లాలో 846 రేషన్ దుకాణాల ద్వారా 3 లక్షల 78 వేల రేషన్ కార్డులకు చెందిన 12 లక్షల పైగా లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ మాధురి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అనంత కిషన్, ప్రదీప్, డీలర్ శశికాంత్ పాల్గొన్నారు.
పాపన్న గౌడ్యువతకు ఆదర్శం
బలహీన వర్గాలను ఐక్యం చేసి పోరాడిన సర్వాయి పాపన్న గౌడ్ నేటి యువతకు ఆదర్శమని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ క్రాంతి అధ్యక్షతన పాపన్న గౌడ్ వర్ధంతిని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పాపన్న గౌడ్ ను ఆదర్శంగా తీసుకొని సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ.. పాలకుల అరాచకాలను నిరసిస్తూ సామాన్యుల్లో తిరుగుబాటు కాంక్షను రగిలించి స్వతంత్రాన్ని ప్రకటించుకున్న మహనీయుడు పాపన్న గౌడ్ అన్నారు. ప్రభుత్వం గౌడ కులస్తుల సంక్షేమం కోసం చేపట్టిన వివిధ స్కీంల గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, వివిధ బీసీ సంఘం నాయకులు, అధికారులు పాల్గొన్నారు.